ప్రేమోన్మాది ఘాతుకం…యువతిపై కత్తి తో దాడి

boy attacked girl with knife

Advertisements

&NewLine;<p>కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది&period; ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఓ ప్రేమోన్మాది యువతి గొంతు కోసేందుకు ప్రయత్నించాడు&period; పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బొద్దుల సాయి అనే యువకుడు కొత్తపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానంటూ గత కొంతకాలంగా వెంటపడుతున్నాడు&period; ఈ క్రమంలో ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితుడు యువతిపై కత్తితో దాడి చేశాడు&period; ఆమె మెడపై తీవ్ర గాయాలయ్యాయి&period; బాధితురాలు కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు&period; అప్పటికే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు&period; యువతిని వెంటనే కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు&period; సమాచారం తెలుసుకున్న ఏసీపీ కరుణాకర్ రావు ఆమె చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రికి వచ్చి స్టేట్మెంట్ రికార్డు చేశారు&period; కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు&period; ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..