వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు…

Mahashivratri Brahmotsavam started with grandeur

Advertisements

&NewLine;<p>శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి&period; ఉదయం 8&period;10 నిమిషాలకు ఆలయ ప్రాంగణంలో స్వామి వారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు&period; సాయంత్రం సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం&comma; ధ్వజపటం ఆవిష్కరించినున్నారు&period; బ్రహొత్సవాలను పురస్కరించుకుని సాయంత్రం శ్రీకాళహస్తి దేవస్థానం వారి తరపున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పించనున్నారు&period; ఈ నెల 11వ తేది వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి&period; 5న రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>8న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సాయంత్రం 5గంటలకు స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం జరుగుతుంది&period; రాత్రి 10 గంటలకు స్వామికి లింగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం&comma; పాగాలంకరణ&comma; రాత్రి 12 గంటలకు బ్రహ్మోత్సవ కల్యాణం కార్యక్రమాలు వైభవంగా జరుగనున్నాయి&period; 9న సాయంత్రం 5 గంటలకు రథోత్సవం&comma; రాత్రి 8 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు&period; 11న అశ్వవాహనసేవ&comma; పుష్పోత్సవం&comma; శయనోత్సవం&comma; ఏకాంతసేవలో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి&period; మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు&period; మార్చి 5 వరకు ఇరుముడి కలిగిన శివదీక్షా భక్తులకు మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం ఉంటుందన్నారు&period; సాధారణ భక్తులు శ్రీ స్వామిఅమ్మవార్ల అలంకార దర్శనం ఏర్పాటు చేశారు&period; ఉత్సవాల్లో ప్రతి రోజూ స్వామి అమ్మవార్లకు వాహనసేవలు&comma; గ్రామోత్సవం నిర్వహిస్తారు&period; మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈవో పెద్దిరాజు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..