దేశంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లాలో మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రేపు 16వ తేదీన నాగర్ కర్నూల్ లో భారీ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు ,మోడీ రాక కోసం బిజెపి శ్రేణులు సభ ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. బిజెపి అధికార ప్రతినిధి దిలీప్ ఆచారి మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ జీ ముచ్చటగా మూడోసారి కూడా ప్రభుత్వ ఏర్పాటు చేస్తాడని, ప్రజలు బిజెపి పట్ల, ప్రధాని నరేంద్ర మోడీ గారి పట్ల చాలా విశ్వాసంగా ఉన్నారని ఖచ్చితంగా బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బిజెపి నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిగా భరత్ ప్రసాద్ ని ప్రకటించిన తర్వాత బిజెపి శ్రేణులు ఎంతో ఆనందంగా ఉన్నారని ఖచ్చితంగా ఈ పార్లమెంటు స్థానాన్ని బిజెపి గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా నాగర్ కర్నూల్ లో రేపు జరగబోయే భారీ బహిరంగ సభకు ప్రజలు, అభిమానులు ,కార్యకర్తలు లక్షలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
లక్ష మందితో మోడీ భారీ బహిరంగ సభ…
99
previous post