భోగి పండుగ సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం పాత గుంటూరు సుద్దపల్లి డొంక ప్రాంతం లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అధికారం లోకి వచ్చాక తెచ్చిన చీకటి జీవోలను స్థానిక ప్రజలు టీడీపీ నాయకులు తో కలిసి జీవో పేపర్లను గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ మొహమ్మద్ నసీర్ గారు మంటల్లో వేసి దహనం చేశారు. ఈ సందర్బంగా నసీర్ గారు మాట్లాడుతూ పనికి రాని వస్తువులను, చేడు కలిగించే వస్తువులను భోగి మంటల్లో అహుతి చేసి మంచి చేకూరాలని అలాగే జగన్ రెడ్డి వచ్చాక రాష్ట్రంలో అరాచక పాలన సాగించటానికి తెచ్చిన చీకటి జీవోలను ఈ రోజు భోగి మంటల్లో వేసి దహనం చేసి జగన్ రెడ్డి నియంత పాలనను తరిమికొట్టాలని రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అయిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయి రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అందరికి భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు గాలి సతీష్, యల్లవుల అశోక్, షేక్ రియాజ్, ఉస్మాన్, బట్టా రాజా, పఠాన్ జమీర్, గుడిపల్లి వాణి, వేములకొండ శ్రీను, మల్లెంపూడి శ్రీనివాస్, ఏలూరి నరేంద్ర, హఫీజ్, వీర్రాజు, రమేష్, కిరణ్, ఏడుకొండలు, పునయ్య, నాయుడు మల్లికా, సుఫియా, నాగ మల్లికా, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
చీకటి జీవోలను దహనం చేసిన మొహమ్మద్ నసీర్…
184
previous post