సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ పట్టణంలో మున్సిపల్ చైర్ పర్సన్ రుబీనా బేగం, వైస్ చైర్మన్ అహిర్ పరుశురాం లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస పరీక్షలో కాంగ్రెస్ నెగ్గింది. 15 మంది కౌన్సిలర్లు ముగ్గురు ఎక్స్ అఫీషియో మెంబర్లు మొత్తం 18 మంది ఓటర్లు ఉండగా 11 మంది కౌన్సిలర్లు ఇద్దరు ఎక్స్ ఆఫిషియో మెంబర్లు నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లు కలిసి 13 ఓట్లు అవిశ్వాస పరీక్షకు మద్దతుగా నిలిచారు. మిగతా ఐదు మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఓటింగ్ కు దూరంగా నిలిచారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. తదుపరి కలెక్టర్ ఆదేశాల మేరకు నూతన చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ఎన్నికకు చర్యలు తీసుకోనున్నట్లు ఎన్నికల అధికారి ఆర్డీవో నలువాల వెంకటేష్ వెల్లడించారు.
నారాయణాఖేడ్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న హస్తం..
78
previous post