ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ..!

defecting MLAs

Advertisements

&NewLine;<p>అనర్హత పిటిషన్ల వ్యవహారంలో వైసీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం మరోసారి నోటీసులు జారీ చేశారు&period; ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 8à°µ తేదీన స్వయంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు&period; ఈసారి వాళ్ల నుంచి పూర్తిస్థాయి వివరణ తీసుకున్నాకే నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి&period; ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఏపీ స్పీకర్‌ కార్యాలయం నుంచి ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు వెళ్లాయి&period; ఫిబ్రవరి 5à°µ తేదీలోగా ఈ నోటీసులకు స్పందించాలని స్పీకర్‌ కార్యాలయం కోరింది&period; వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు పిటిషనర్ అయిన ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజులకు నోటీసులు పంపించారు&period; ఈ ఐదుగురిని ఒకేసారి కలిపి స్పీకర్‌ తమ్మినేని విచారణ చేయనున్నారు&period; మరోసారి ఎమ్మెల్యేల వివరణ తీసుకోనున్న తర్వాతే ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ విషయంలో ఓ స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.