నారాయణపేట జిల్లా గుండుమాల్ మండల కేంద్రంలో రైతు దగ్గర లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీకి చిక్కాడు. మండల కేంద్రానికి చెందిన తహసిల్దార్ పాండు నాయక్ మల్లేష్ అనే రైతు వద్ద మూడు వేలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ వల పన్ని పట్టుకున్నారు. గత వారం రోజుల కిందట గుండుమల్ మండల కేంద్రంలో చెందిన రైతు మల్లేష్ తన భూమి రిజిస్ట్రేషన్ సంబంధించి ఎమ్మార్వో ని సంప్రదించాడు. అయితే దానికి ఎమ్మార్వో 3000 లంచం అడిగాడు మొదటగా వేయి రూపాయలు ధరణి ఆపరేటర్ అకౌంట్ లోకి వేశాడు. అనంతరం మల్లేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారు ఈరోజు ఆఫీసులో రికార్డు అసిస్టెంట్ కు రెండు వేలు ఇస్తూ ఎమ్మార్వో తీసుకుంటుండగా ఏసీబీ డి.ఎస్.పి కృష్ణగౌడ్ పట్టుకున్నారు. ఈ విషయంలో ముగ్గురిపై కేసు నమోదు చేసామని ఎసిబి డిఎస్పీ తెలిపారు…
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి…
119
previous post