గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీసే ఉద్దేశంతోనే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ క్రీడలను పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షురాలు పద్మావతి, ఆర్డీవో రాజు, తాడిగడప మున్సిపల్ కమిషనర్ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోలుసు పార్థసారథి జాతీయ జెండాను ఆవిష్కరించి ఆడుదాం ఆంధ్ర తాడిగడప మున్సిపాలిటీ స్థాయి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ఆడుకుందాం ఆంధ్రా లాంటి కార్యక్రమం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి వచ్చి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని వీలుందన్నారు. క్రీడల వల్ల మానసికోల్లాసంతో పాటు గెలుపోటములను ఒకే విధంగా తీసుకునే లక్షణం అలవడుతుందని నేటి యువత సెల్ఫోన్లకు, కంప్యూటర్లకు అతుక్కుపోయి శారీరిక శ్రమను విస్మరిస్తున్నారని దీనివల్ల యువతలో పోరాట స్ఫూర్తి కొరవడుతుందన్నారు. ఆడుదాం ఆంధ్రను ప్రతి ఒక్కరు ప్రోత్సహించి విజయవంతం చేయాలని సారధి కోరారు.
ఓ అన్నా..తంబి…రా ఆడుదాం
78
previous post