ప్రభుత్వ ఆనాలోచన నిర్ణయం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. ఉయ్యూరు ఆర్టీవో కార్యాలయంలో ధాన్యం కొనుగోలు పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తో పాటు ఆర్డిఓ రాజు, ఎమ్మార్వో మస్తాన్ రావు, నగర పంచాయతీ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్ బి కే నుండి మిల్లర్లకు తరలించిన ధాన్యం రోజుల తరబడి దిగుమతి చేసుకోకుండా తేమ శాతం పేరుతో బస్తాకు 300 నుంచి 400 రూపాయలు తగ్గించి ఇస్తున్నారని దీనిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పార్థసారథి ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించడం లేదని అలాగే తేమశాతం పేరుతో మిల్లర్లు రైతులను మోసగిస్తున్న అధికారులు, మంత్రులు స్పందించడం లేదని అన్నారు. పకృతి విపత్తు వల్ల ఈ సంవత్సరం కుప్పనూరుపుళ్ళు మార్చి తర్వాత కూడా జరుగుతాయని కానీ ప్రభుత్వం మార్చి తర్వాత ధాన్యం కొనుగోలు చేస్తామని భరోసాని మాత్రం రైతులకు కల్పించడం లేదని అన్నారు. మంత్రులు ప్రతిపక్షాలను బూతులు తిట్టడమే కాదని రైతు సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని చురక అంటించారు. ఇక్కడ ధాన్యాన్ని కడప, కర్నూలు, నెల్లూరు మిల్లులకు తరలించి ఇక్కడ మిల్లర్లకు సైతం ప్రభుత్వం అన్యాయం చేస్తుందని సారధి తెలిపారు.
Penamalur MLA Kolusu Parthasarathy
గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీసే ఉద్దేశంతోనే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ క్రీడలను పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షురాలు పద్మావతి, ఆర్డీవో రాజు, తాడిగడప మున్సిపల్ కమిషనర్ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోలుసు పార్థసారథి జాతీయ జెండాను ఆవిష్కరించి ఆడుదాం ఆంధ్ర తాడిగడప మున్సిపాలిటీ స్థాయి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ఆడుకుందాం ఆంధ్రా లాంటి కార్యక్రమం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి వచ్చి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని వీలుందన్నారు. క్రీడల వల్ల మానసికోల్లాసంతో పాటు గెలుపోటములను ఒకే విధంగా తీసుకునే లక్షణం అలవడుతుందని నేటి యువత సెల్ఫోన్లకు, కంప్యూటర్లకు అతుక్కుపోయి శారీరిక శ్రమను విస్మరిస్తున్నారని దీనివల్ల యువతలో పోరాట స్ఫూర్తి కొరవడుతుందన్నారు. ఆడుదాం ఆంధ్రను ప్రతి ఒక్కరు ప్రోత్సహించి విజయవంతం చేయాలని సారధి కోరారు.




Total views : 78881