ఏపీ(AP)లో వాలంటీర్ల(Volunteers) రాజీనామా(Resignation) కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని ఉయ్యూరు మండలంలో పలువురు తమ ఉద్యోగాలను వదిలేశారు. పెద్ద ఓగిరాల గ్రామంలో 22 మంది వలంటీర్లు గుడ్ బై చెప్పారు. రాజీనామా పత్రాలను కార్యదర్శికి అందించారు. చంద్రబాబు(Chandrababu) చేసిన కుట్రలకు మనస్థాపానికి గురయ్యామని పేర్కొన్నారు.
ఇది చదవండి: తృటిలో తప్పిన ప్రమాదం..
జగన్మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy)కి మద్దతుగా ఎన్నికల్లో పనిచేస్తామని చెప్పారు. వృద్దులు, వికలాంగులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ ఇవ్వడం తమ ఉద్యోగంలో అత్యంత తృప్తిని ఇచ్చిన అంశమని వారు తెలిపారు. మరో నెల రోజులు ఓపిక పడితే మళ్లీ ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇచ్చే అవకాశం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేత
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి