ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీని లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయించాలని తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సోమవారం గాంధీ భవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన పీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మరో నాలుగైదు నెలల్లో లోక్ సభ ఎన్నికలు రానున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో గతంలో రెండింతల స్థానాలు గెలుస్తామని ఆశాభావంతో ఉంది. ఆ జోష్ ను కంటెన్యూ చేసేందుకు…పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జ్ లను నియమించారు. చేవెళ్ల, మహబూబ్ నగర్ కు రేవంత్ రెడ్డి, ఖమ్మం జిల్లాకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ – ఉత్తమ్ కుమార్రెడ్డి, కరీంనగర్ – పొన్నం ప్రభాకర్ లను నియమించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీని త్వరలో భర్తీ చేయాలని నిర్ణయించారు. అలాగే అసెంబ్లీలో విద్యుత్, ఇరిగేషన్, ఆర్థికపరిస్థితిపై సభలో మూడు రోజుల పాటు చర్చ నిర్వహించాలని తీర్మానించారు.
పీఏసీ సమావేశం….
69
previous post