ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీని లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయించాలని తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సోమవారం గాంధీ భవన్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన పీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మరో నాలుగైదు నెలల్లో లోక్ సభ ఎన్నికలు రానున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో గతంలో రెండింతల స్థానాలు గెలుస్తామని ఆశాభావంతో ఉంది. ఆ జోష్ ను కంటెన్యూ చేసేందుకు…పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జ్ లను నియమించారు. చేవెళ్ల, మహబూబ్ నగర్ కు రేవంత్ రెడ్డి, ఖమ్మం జిల్లాకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ – ఉత్తమ్ కుమార్రెడ్డి, కరీంనగర్ – పొన్నం ప్రభాకర్ లను నియమించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీని త్వరలో భర్తీ చేయాలని నిర్ణయించారు. అలాగే అసెంబ్లీలో విద్యుత్, ఇరిగేషన్, ఆర్థికపరిస్థితిపై సభలో మూడు రోజుల పాటు చర్చ నిర్వహించాలని తీర్మానించారు.
సోనియా గాంధీ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా అధికారం చెపట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకోని పాతవారిని కొత్తవారిని కలుపుకోని ముందుకెళ్తుంది. అయితే చెన్నూరు అసెంబ్లీ టికెట్ విషయంలో సంధిగ్దత నెలకొన్న తరుణంలో కాంగ్రెస్ నేత నల్లెల ఓదెలు, ఇటివలే కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి తో కలసి సీనియర్ నేత జానరెడ్డితో సమావేశం అయ్యారు. ఈ నేపధ్యంలో చెన్నూరు టికెట్వి వేక్ వెంకట్ స్వామికి ఇవ్వాలనీ నల్లెల ఓదెలు కోరారు. వివేక్ కి టికెట్ ఇస్తే ఎలాంటి విబేదాలు లేకుండా పనిచేస్తామన్నారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని అన్నారు. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధీకారంలోకి వస్తుందని థీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో నిర్దిష్టమైన విధానాలతోనే ప్రజల వద్దకు వెళ్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడేలా బీఆర్ఎస్ పాలన ఉందని విమర్శించారు. కేసీఆర్ పాలన ఎలా ఉందో యువత, రైతులు, మహిళలు అడిగితే బాగా చెబుతారన్నారు. ఈ ప్రాంత ప్రజల పోరాటంలో న్యాయం, ధర్మం ఉందని నమ్మి.. ఎన్ని రాజకీయ ఇబ్బందులు ఎదురైనా సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని రేవంత్ అన్నారు. ఈ పదేళ్లలో కేసీఆర్ ఏం చెప్పారు.. ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. పేదల సంక్షేమం కోసం నిధులు ఉపయోగపడ్డాయో లేదో ఆలోచన చేయాలన్నారు. నిరసనలు తెలపడం వంటి ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాసిందని ఆరోపించారు. స్వరాష్ట్రంలో ఎన్నో మార్పులు వస్తాయని ఆశించిన యువత ఆకాంక్షలు అడియాశలు అయ్యాయని రేవంత్ విమర్శించారు. పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ విఫలమైందని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన పాత హామీలనే అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారన్నారు. తెలంగాణ కోసం ఎందరో యువకులు ప్రాణత్యాగం చేశారని.. రాష్ట్ర చిహ్నంలో ప్రజల త్యాగాల గుర్తులు ఉండాలన్నారు.





Total views : 77949