(అనకాపల్లి జిల్లా)
పరవాడ మండలం తాడి గ్రామంలో పెందుర్తి NDA కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు(Panchkarla Ramesh Babu) విస్తృత ప్రచారం చేశారు. గ్రామస్తులు, మహిళలు పంచకర్ల రమేష్ బాబు ను ఆప్యాయంగా పలకరిస్తూ హారతులతో వీర తిలకం దిద్ది ఆహ్వానించారు. ఈ ప్రచారంలో బాగంగా పంచకర్ల రమేష్ బాబుకి జన సైనికులు, మహిళలు, టీడీపీ శ్రేణులు, భాజపా శ్రేణులు, మరియు పంచకర్ల అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఒక ఎమ్మెల్యేగా తాడి గ్రామస్తులకు అండగా నిలబడాల్సింది పోయి, చిన్న తరలింపు ప్రయత్నం కూడా చేయలేదన్నారు. ఈ ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిని ఈ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం భరించిందనీ అన్నారు. తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే సంవత్సరంలోపు తాడి గ్రామ తరలింపు జరగడం ఖాయం. అన్ని న్యాయపరమైన చిక్కులను అధిగమించి ఏదైతే స్ట్రక్చర్ కాంపౌండ్ దగ్గర నుంచి మంచి ఏరియాలో బ్రహ్మాండమైన కాలనీ నిర్మిస్థాం. గ్రామ ప్రజలకు పొల్యూషన్ లేని జీవితాన్ని ఇవ్వడమే ముఖ్యఉద్దేశ్యం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఐదు సంవత్సరాలు రాక్షస పాలన చూసాం- పంచకర్ల రమేష్ బాబు| Panchkarla Ramesh Babu
ఉద్యోగ ఉపాధి అవకాశాన్ని తాడి ప్రజలకు ఇవ్వటానికి మేము కంకణ బద్దలమై ఉన్నాం. ఐదు సంవత్సరాలు ఒక దుర్మార్గపు రాక్షస పరిపాలన మనం చూసాం. ఏమన్నా అంటే ప్రతి ఎలక్షన్‌కి ఒక డ్రామా వేయటం సరసాధారణం. గత ఎలక్షన్ లో కోడి కత్తి కేసు, బాబాయిని తెలుగుదేశం పార్టీ చంపించిందని, మరి మొన్నటి మొన్న విజయవాడలో రాయి భౌన్స్ అయి ఇద్దరికి తగిలిందంట. లైట్లు తీసి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి నువ్వు నన్ను కొట్టు నేను నిన్ను కొడతానని చెప్పి కొట్టించుకుని చిన్న గీత గీయించుకుని తెలుగుదేశం దాడి అని చెప్పుకునే దుర్మార్గపు రాజకీయం నడుస్తుందన్నారు. అంతకుముందు కార్లు బద్దలు కొట్టి, స్టేజీలు బద్దలు కొట్టి, బస్సుల మీద రాళ్లు వేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీద దాడి, అది వైఎస్ఆర్సీపీ దాడి కాదా అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: NDA కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు విస్తృత ప్రచారం