113
తిరుమల శ్రీవారి సేవలో పారిజాత పర్వం(Parijata Parvam) మువీ టీమ్
తిరుమల శ్రీవారిని పారిజాత పర్వం మువీ టీమ్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో నటులు చైతన్య రావు, శ్రద్ధా దాస్(shraddha das), హర్షలు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండలంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని వారు తెలిపారు.తిరుమల శ్రీవారి బ్లెషింగ్స్ కోసం వచ్చామని చెప్పారు. శ్రీవారి ఆశీశ్సులతో చిత్రం మంచి హిట్ అవ్వాలని చిత్ర బృందం ఆకాంక్షించారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి