117
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వరరావు పేట గ్రామానికి చెందిన గడ్డం సత్తయ్య అనే వ్యక్తి ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి పెంకుటిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు నాలుగు లక్షల 50 వేల రూపాయల నగదు, పది తులాల బంగారు నగలు, బట్టలతోపాటు నిత్యావసర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో గడ్డం సత్తయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్ళాడు. ఇరుగుపొరుగువారు సమాచారం ఇవ్వడంతో ఇంటికి వచ్చి చూసేసరికి ఇల్లు పూర్తిగా దగ్ధమైపోయింది. కాయ కష్టం చేసి వడ్లు అమ్మి ఇంట్లో దాచిపెట్టిన నగదు ఇలా పూర్తిగా కాలిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనస్థాపానికి గురి అయ్యారు. ప్రభుత్వము తమను ఆదుకోవాలని వేడుకున్నారు.