సత్యసాయి జిల్లా పర్యటించనున్న ప్రధాని మోడీ…

Inauguration of Nasin Center

Advertisements

&NewLine;<p>ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి ఎయిర్పోర్ట్ కు 12 గంటల 50 నిమిషాలకు చేరుకుంటారు&period; MI- 17 హెలికాప్టర్ ద్వారా హిందూపురం సమీపంలోని లేపాక్షి లో హెలిపాడ్ లో దిగుతారు&period; అనంతరం లేపాక్షి లోని వీరభద్ర ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తరువాత&comma; ఆలయంలోని శిల్ప సంపదను సందర్శిస్తారు&period; గంటపాటు లేపాక్షిలో గడిపిన అనంతరం హెలికాఫ్టర్ ద్వారా గోరంట్ల మండలం పాలసముద్రం లో ఉన్న నాసిన్ కేంద్రానికి చేరుకుంటారు&period; నూతనంగా నిర్మించిన నాసిన్ కేంద్రం ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు&period; ప్రధానితోపాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్&comma; ఇద్దరు కేంద్ర సహాయ మంత్రులు&comma; ఏపీ ముఖ్యమంత్రి జగన్&comma; గవర్నర్ అబ్దుల్ నజీర్&comma; ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు&period; అనంతరం నాసిన్ కేంద్రం లోని పలు విభాగాలను ఆయన పరిశీలించిన అనంతరం ప్రత్యేక విమానంలో కొచ్చిన్ కు బయలుదేరి వెళ్తారు&period; ప్రధాని పర్యటన భద్రత ఏర్పాట్లను ఏపీ అడిషనల్ డీజీ శంకర్ భక్త భాజిల్ నేతృత్వంలో డిఐజి అమ్మిరాజు పర్యవేక్షిస్తున్నారు&period; శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఇప్పటికే ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు&period; మరోవైపు ఏపీ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..