67
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్ళ గ్రామ సమీపంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఆ వ్యక్తి వద్ద నుండి రెండు లక్షల రూపాయలు విలువ చేసే ఎనిమిది కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిషా నుండి హైదరాబాద్ గంజాయిని తీసుకు వెళ్తు తనికెళ్ల సమీపంలో దిగి వేరొక వాహనం కోసం ఎదురుచూస్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు పట్టుబడిన వ్యక్తి మల్కన్‌గిరి, ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి గా గుర్తించారు. గంజాయి తో పట్టుబడిన వ్యక్తిని అరెస్టు చేసి ఖమ్మం కోర్టుకు తరలించారు దాడులలో ఎక్సైజ్ అధికారులు రమ్య, కిరీటి, మమత సిబ్బంది ఫాల్గొన్నారు.