గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసులో ఏ-10 నిందితుడిగా క్రిష్ ఉన్నారు. అయితే డైరెక్టర్ క్రిష్ పరారీలో ఉన్నాడని కోర్టుకు పోలీసులు తెలిపారు. ఇప్పటికే సీఆర్పీసీ 160 కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక, ఈ కేసు రిమాండ్ రిపోర్టులో సైతం డైరెక్టర్ క్రిష్ వివేకానందతో కలిపి డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడించడం సంచలనంగా మారింది. ఈ నెల 24న రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలో క్రిష్ పాల్గొన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రఘునందన్, క్రిష్ ల ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండగా.. క్రిష్ ముంబైలో ఉన్నట్లు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించారు. మొత్తం పరారీలో ఉన్న ఏడుగురి ఆచూకి తెలుసుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
98
previous post