గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసులో ఏ-10 నిందితుడిగా క్రిష్ ఉన్నారు. అయితే డైరెక్టర్ క్రిష్ పరారీలో ఉన్నాడని కోర్టుకు పోలీసులు తెలిపారు. ఇప్పటికే సీఆర్పీసీ 160 కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక, ఈ కేసు రిమాండ్ రిపోర్టులో సైతం డైరెక్టర్ క్రిష్ వివేకానందతో కలిపి డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడించడం సంచలనంగా మారింది. ఈ నెల 24న రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలో క్రిష్ పాల్గొన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రఘునందన్, క్రిష్ ల ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండగా.. క్రిష్ ముంబైలో ఉన్నట్లు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించారు. మొత్తం పరారీలో ఉన్న ఏడుగురి ఆచూకి తెలుసుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
Drug Case
గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. కేసు ఎఫ్ఐఆర్లో గచ్చిబౌలి పోలీసులు టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ క్రిష్ పేరు చేర్చడం చర్చనీయాంశంగా మారింది. కాగా, నేడు క్రిష్‌ను డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణ చేపట్టనున్నారు. దీంతో పాటు క్రిష్ బ్లడ్ శాంపిల్స్‌ను పోలీసులు సేకరించనున్నారు.
ఇది చదవండి: నేడు తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం
అయితే గతంలో వివేక్ నిర్వహించిన పార్టీకి క్రిష్ హాజరయ్యారా లేదా అనేది పూర్థి స్థాయిలో చేస్తున్నారు. ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్‌కి ముగ్గురు నిందితుల ఫోన్లను పోలీసులు పంపారు. విచారణలో పెడ్లర్ అబ్బాస్ స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. ఇప్పటికే వివేకానందకు అబ్బాస్ అలీ డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ సరఫరా చేసిన సయ్యద్ అబ్బాస్‌ను పోలీసులు నిన్న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో గచ్చిబౌలి పోలీసులు డైరెక్టర్ క్రిష్ పేరును చేర్చారు. రాడిసన్ హోటల్ లో పార్టీ జరిగేటప్పుడు ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన వివేకానందతో క్రిష్ ఉన్నట్లు పోలీసులు తేల్చారు.
ఇది చదవండి: ఎంజీఎం హాస్పిటల్లో నకిలీ సర్టిఫికెట్స్ కలకలం…
ఈ మేరకు నిందితుల జాబితాలో క్రిష్ పేరును చేర్చినట్లు తెలుస్తోంది. ఎఫ్ఐఆర్లో ఉన్న నిందితులందరిని పిలిచి విచారిస్తామని పోలీసులు తెలిపారు. ఈ పార్టీలో మరికొందరు సెలబ్రెటీలు సైతం పాల్గొన్నట్లు సమాచారం. కాగా, బీజేపీ నేత యోగానంద్కుమారుడు వివేకానంద్ రాడిసన్ హోటల్లో ఫ్రెండ్స్‌కు డ్రగ్స్ పార్టీ ఇచ్చాడు. తాజాగా ఈ కేసులో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడిని పోలీసులు నిందితుడిగా చేర్చారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 80281