రైతు నేస్తం ప్రొగ్రామ్‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్‌ల అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేస్తమని సీఎం రేవంత్ అన్నారు. దశల వారీగా 3 సంవత్సరాల్లో 2,601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల స్థాపన చేయనున్నట్లు తెలిపారు. 97 కోట్లతో రైతునేస్తం ప్రాజెక్టు అమలు చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వ్యవసాయాన్ని లాభ సాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్ ఫ్లాట్ ఫారం ఉపయోగపడుతుందని సీఎం అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యలపై రైతులతో చర్చలు జరపవచ్చన్నారు. గ్రామాల నుంచే రైతులు ఆన్లైన్లో తమ పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందుకోవచ్చన్నారు. తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవచ్చన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు, రైతులతో ‘రైతు నేస్తం’ కార్యక్రమం అమలవుతుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
రైతులతో ‘రైతు నేస్తం’ కార్యక్రమం…
117
previous post