‘రామ్’ అందరినీ ఆకట్టుకుంటుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయి కుమార్

RAM Movie

Advertisements

&NewLine;<p>దేశ భక్తిని చాటే చిత్రంగా రామ్ &lpar;RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్&rpar; రాబోతోంది&period; దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం&period;1గా ఈ సినిమాను రూపొందించారు&period; మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు&period; ఆయనే ఈ మూవీకి కథ&comma; స్క్రీన్ ప్లే&comma; డైలాగ్స్ కూడా అందించారు&period; దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయాజుల హీరోగా పరిచయం కానున్నారు&period; ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటించారు&period; ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26à°¨ విడుదల కాబోతోంది&period; ఇప్పటికే టీజర్&comma; ట్రైలర్‌‌లతో అంచనాలు పెంచేశారు&period; మంగళవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పీపుల్స్ మీడియా అధినేత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;మంచి కంటెంట్‌తో రామ్ చిత్రం రాబోతోంది&period; ఎన్నో ఆర్థిక కష్టాలను పడి ఈ చిత్రాన్ని నిర్మించారు&period; నేను కొంత రషెస్ చూశాను&period; సినిమా బాగా వచ్చింది&period; మొదటి సినిమానే అయినా సాయి కుమార్ పక్కన సూర్య బాగా నటించారు&period; కంటెంట్ ఉంటే&period;&period; చిన్న చిత్రాలు కూడా పెద్ద చిత్రాలుగా మారుతున్నాయి&period; ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నిర్మాత బెక్కెం వేణు గోపాల్ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;ప్రాణాలను పణంగా పెట్టి మన కోసం సైనికులు పోరాడుతుంటారు&period; మన సైనికులు&comma; ప్రాణ త్యాగాల మీద చిత్రాలు వస్తుంటాయి&period; ఇలాంటి ఓ మంచి సందేశాత్మక చిత్రం తీసిన దర్శక నిర్మాతలకు హ్యాట్సాఫ్&period; వారి త్యాగాలను చూపించి అందరికీ మరోసారి వారి గొప్పదనాన్ని చాటి చెప్పారు&period; ఎంతో నిజాయితీగా ఈ సినిమాను తీశారు&period; సాయి కుమార్&comma; ధన్యా బాలకృష్ణ పాత్రలు బాగున్నాయి&period; మొదటి చిత్రం కావడంతో సూర్య తనకు తాను నిరూపించుకునేందుకు చాలా కష్టపడ్డారు&period; అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించారు&period; దేశ భక్తిని చాటే చిత్రంగా జనవరి 26à°¨ రాబోతోంది&period; ప్రేక్షకులందరూ చూసి విజయాన్ని అందించాలి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>హీరో సూర్య అయ్యలసోమయాజుల మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;మా సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన వివేక్ కూచిభొట్ల&comma; బెక్కెం వేణుగోపాల్ గారికి థాంక్స్&period; మా అమ్మానాన్నలు ఎవరో ప్రేక్షకులకు తెలియదు&period; ఒక హిట్ ఇస్తే ఇండస్ట్రీ అంతా తిరిగి చూస్తుంది&period; అందుకే ఈ సినిమాను తీశాం&period; ఈ చిత్రానికి నలుగురు పిల్లర్స్‌గా నిలిచారు&period; నేను&comma; డైరెక్టర్&comma; కెమెరామెన్ ధారన్ సుక్రి&comma; నా ఫ్రెండ్స్&period; నా స్నేహితులందరూ కలిసి ఫండింగ్ చేసి ఈ చిత్రాన్ని నిర్మించారు&period; చిన్న చిత్రం పెద్ద చిత్రం అనేది ఉండదు&period; మొన్నే పెద్ద చిత్రాల మధ్యలో చిన్న సినిమా వచ్చి నిలబడింది&period; ఇప్పుడు కూడా పెద్ద చిత్రాల నడుమ చిన్న చిత్రం రాబోతోంది&period; రామ్ అంటే భక్తి సినిమా కాదు&period;&period; దేశ భక్తి సినిమా&period; ఇక మున్ముందు రామ్ పేరు వినిపిస్తూనే ఉంటుంది&period; వందలో అరవై మందికి మా సినిమా కచ్చితంగా నచ్చుతుంది&period; నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు మిహిరామ్ గారికి థాంక్స్&period; భానుచందర్&comma; సాయి కుమార్ గారికి థాంక్స్&period; ప్రతీ డైలాగ్ తూటాలా ఉంటుంది&period; క్లైమాక్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది&period; సినిమా బాగుంటే&period;&period; బాగుందని లేకపోతే బాగా లేదని చెప్పండి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సాయి కుమార్ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;చాలా రోజుల తరువాత దేశ భక్తిని చాటే చిత్రంలో నటించాను&period; మొదటి సినిమాతోనే ఇలాంటి జానర్‌ను ఎంచుకుని సూర్య చాలా కష్టపడ్డాడు&period; హీరో సూర్య&comma; దర్శకుడు మిహిరామ్ ఇద్దరూ కృష్ణార్జునలుగా కలిసి ఎంతో కష్టపడి సినిమాను తీశారు&period; మా సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన వివేక్ కూచిభొట్ల&comma; బెక్కెం వేణుగోపాల్ గారికి థాంక్స్&period; ధన్య బాలకృష్ణ చక్కగా నటించారు&period; ఫైట్స్ అన్నీ బాగుంటాయి&period; డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి&period; సినిమాను మా వంతుగా చేశాం&period; ఇక నిర్ణయం ప్రజలదే&period; కంటెంట్ బాగుంటే&period;&period; ఆడియెన్స్‌కి కనెక్ట్ అయితే సినిమాను ఆపలేరు&period; ఇప్పుడు అంతటా హనుమాన్ ఆడుతోంది&period; ఇప్పుడు ఈ రామ్ సినిమా కూడా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దర్శకుడు మిహిరాం మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;మా చిత్రానికి సపోర్ట్‌గా నిలిచిన వివేక్ కూచిభొట్ల గారికి&comma; బెక్కెం వేణుగోపాల్ గారికి థాంక్స్&period; నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత దీపికాంజలికి థాంక్స్&period; సినిమాలో నటించిన&comma; పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్&period; ధారన్ సుక్రి మంచి కెమెరామెన్‌గా ఇండస్ట్రీలో ఎదుగుతారు&period; రాజ్ కుమార్ మాస్టర్ ఫైట్స్ బాగుంటాయి&period; దేశ భక్తిని చాటే చెప్పే చిత్రమే కానీ&period;&period; బార్డర్‌లో ఉండే సైనికుల గురించి చెప్పేది కాదు&period; ఓ సైనికుడు చనిపోతే దక్కే గౌరవం వాళ్లకి దక్కదు&period; అలాంటి అన్ సంగ్ హీరోల గురించి చూపించాను&period; మాకు ఇప్పుడు థియేటర్లు దొరకడం కూడా కష్టంగా ఉంది&period; కానీ మంచి థియేటర్లను తెచ్చుకునేందుకు డిస్ట్రిబ్యూటర్ గణేష్ ప్రయత్నిస్తున్నారు&period; మా సినిమాను ప్రేక్షకులు చూసి ఆదరించాలి&period; మంచి విజయాన్ని అందించాలి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నిర్మాత దీపికాంజలి మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;మాకు ఇది మొదటి సినిమా&period; మేం సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి రాలేదు&period; దర్శకుడు చెప్పిన బడ్జెట్లో చెప్పినట్టుగా సినిమాను తీశారు&period; సూర్య చక్కగా నటించారు&period; ధన్య బాలకృష్ణ చేసిన ఓ ఎమోషనల్ సీన్ చూస్తే ప్రేక్షకులు కంటతడి పెడతారు&period; భాను చందర్&comma; సాయి కుమార్&comma; శుభలేఖ సుధాకర్ వంటి వారి నటన గురించి చెప్పే స్థాయి నాకు లేదు&period; ఈ సినిమాకు తెగే ప్రతీ టికెట్‌లో రూ&period; 5లు డిఫెన్స్‌కు ఇస్తాం&period; మన దేశ సైనికులకు ఈ సినిమాను అంకితం చేస్తున్నామ’ని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;మా సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన వివేక్ కూచిభొట్ల&comma; బెక్కెం వేణుగోపాల్ గారికి థాంక్స్&period; వారి రాకతో వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు అయింది&period; సాయి కుమార్ గారితో నటించడంతో లైఫ్ సర్కిల్ కంప్లీట్ అయినట్టుగా అనిపించింది&period; సూర్య&comma; దీపికలు ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టారు&period; దర్శకుడు చాలా పెద్ద స్థాయికి వెళ్తారు&period; మా చిత్రానికి ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించాలి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..