అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా అనంతపురం జిల్లా గుత్తి ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో శ్రీ సీత రాముల ఉత్సవ విగ్రహాలను సోమవారం పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ముందుగా వేణుగోపాలస్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామభక్తులు ఆర్యవైశ్య మహిళ మండలి కమిటీ సభ్యులు కోలాటం చేస్తూ రామనామం జపిస్తూ నృత్యాలు చేస్తూ కోటలోని కోదండ రామస్వామి ఆలయం వరకు కాషాయ జెండాలు పట్టుకుని జైశ్రీరామ్ అంటూ నినాదాలతో ఊరేగింపు నిర్వహించారు. పురవీధులు రామనామంతో మారుమోగాయి. అనంతరం కోదండ రామస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల స్వామివారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తాదులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసారు. మధ్యాహ్నం వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తాదులకు ఆలయం వద్ద భోజన వసతి ఏర్పాటు చేశారు.
రామనామస్మరణతో మారుమ్రోగిన గుత్తి పట్టణ పురవీధుల
70
previous post