అనంతపురం జిల్లా గుత్తి మార్కెట్ యార్డులో మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి పత్తి రైతులను ఆదుకోవాలని ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. చేతకాని ప్రభుత్వం రైతులను తీరని అన్యాయం చేసిందంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పత్తి రైతులను ఆదుకొని పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వలన రైతులకు తీవ్రం నష్టం చేకూర్చిందని వాపోయారు. ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి ఈ రైతులను ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు మరింత చేస్తామని హెచ్చరించారు.
ananthapuram district
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా అనంతపురం జిల్లా గుత్తి ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో శ్రీ సీత రాముల ఉత్సవ విగ్రహాలను సోమవారం పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ముందుగా వేణుగోపాలస్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామభక్తులు ఆర్యవైశ్య మహిళ మండలి కమిటీ సభ్యులు కోలాటం చేస్తూ రామనామం జపిస్తూ నృత్యాలు చేస్తూ కోటలోని కోదండ రామస్వామి ఆలయం వరకు కాషాయ జెండాలు పట్టుకుని జైశ్రీరామ్ అంటూ నినాదాలతో ఊరేగింపు నిర్వహించారు. పురవీధులు రామనామంతో మారుమోగాయి. అనంతరం కోదండ రామస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల స్వామివారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తాదులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసారు. మధ్యాహ్నం వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తాదులకు ఆలయం వద్ద భోజన వసతి ఏర్పాటు చేశారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎన్టీఆర్ కాలనీ వాసులు త్రాగునీటి కోసం ఆర్డీటీ ఆసుపత్రికి ఎదురుగా ప్రధాన రహదారి పై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. త్రాగునీటి కోసం కాళీ బిందెలతో మహిళలు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదేమి రాజ్యం నీళ్లు లేని రాజ్యం అంటూ మహిళలు నినాదాలు చేశారు. వారు మాట్లాడుతూ.. గొంతులోకి గుక్కెడు నీరు అందక రోడ్డెక్కామని ఏమి సీఎం అని ఇదేమి రాజ్యమని సీఎం పై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులుగా త్రాగునీటి కోసం అల్లాడుతున్నామన్నారు. ఉప్పు నీటి కోసం రెండు కిలోమీటర్లు వెళ్లి తెచుకుంటున్నామని మండిపడ్డారు. సమ్మె లో ఉన్న శ్రీరామిరెడ్డి కార్మికులకు జీతాలు ఇస్తేనే కదా నీళ్లు విడిచేది ఇలా చేస్తే ఎలా అని ప్రభుత్వాన్ని కాలనీ వాసులు నిలదీశారు. కనీసం మా కౌన్సిలర్ కాలనీ వైపు తొంగి కూడా చూడలేదు. కౌన్సిలర్ పరారీ అయ్యాడని మహిళలు మండిపడ్డారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోరు. ఎన్నికల వేల ఓట్లు కోసం వచ్చి అది చేస్తాం ఇది చేస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమయ్యారని వైసీపీ నాయకులను దుయ్యబట్టారు.
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం అమడగూరు మండలంలో చౌడేశ్వరి దేవి అమ్మవారి గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టి జయహో బిసి కార్యక్రమాన్ని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లె బైక్ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభకు బయలుదేరారు. అమడగూరు మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పాటు, సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు BK పార్థసారధి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంబిక లక్ష్మీనారాయణ మరియు బిసి అధ్యక్షుడు కుంటిమద్ది మాజీ ఎంపీపీ రంగయ్య, మరియు పెద్ద ఎత్తు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లె రఘునాథ్ రెడ్డి, బికే పార్థసారథులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కి బీసీలు వెన్ను దన్నుగా నిలిచి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. టిడిపి హయాంలోనే బీసీలకు అధిక ప్రాధాన్యత నిచ్చి రాజకీయంగా సామాజికంగా ముందుకు తీసుకుపోయిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు.
అనంతపురం జిల్లా గుత్తి మండలంలో కీచక యోగా టీచర్ ను గురువారం గుత్తి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పి నర్సింగప్ప వెల్లడించారు. డిఎస్పీ మాట్లాడుతూ…. గుత్తి మండలం తొండపాడు గ్రామంలోని జడ్పీహెచ్ స్కూల్ నందు ఔట్ సోర్సింగ్ పై యోగా టీచర్ గా పని చేస్తున్న అనిల్ కుమార్ రెడ్డి అదే స్కూల్లో చదివే ఓ మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి నమ్మించి బాలిక ఇంటిలోని బంగారు నగలు తెప్పించుకుని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెంట తీసుకొని పోయి శారీరకంగా అనుభవించి తిరిగి గుత్తికి తీసుకొచ్చి వదిలేసి తనకు బంగారం ఇచ్చినట్లు గాని, శారీరకంగా కలిసినట్లు గాని, ప్రేమ విషయం గానీ, ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఇతనిపై గతంలో 2019వ సంవత్సరంలో ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా రేప్ కేసులో నిందితుడు నిందితుడిగా ఉంటూ ఆ కేసులో కోర్టు వాయిదాలకు హాజరవుతున్నాడు. అయితే గత నెల 25 నుంచి బాలిక కనపడకపోవడంతో తల్లిదండ్రులు గుత్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి అనుమానంతో పాఠశాలలో పనిచేసే యోగా టీచర్ అనిల్ కుమార్ రెడ్డిని విచారణ చేయగా ఈ భాగోతం బయటపడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు యోగా టీచర్ అనిల్ కుమార్ రెడ్డిపై IPC 366, 344, 376,406,మరియు ఫోక్సో ఆక్ట్ 5,6 సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. అతని వద్ద నుంచి ఒక సెల్ ఫోను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. అనంతరం ముద్దాయిని కోర్టుకు హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు.





Total views : 74860