87
చిత్తూరు జిల్లా, నగరి మండలం, అయనంబాకం తన స్వగ్రామమని, సి .సి .రోడ్లు మంజూరు కాబడి దాదాపు నాలుగు సంవత్సరాలు అయిందని, పనులు మొదలెట్టలేదని, సంబంధిత వారిని ప్రశ్నిస్తే పనులు చేశాక రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయట్లేదు కాబట్టి తాము రిస్కు తీసుకోమని కాంట్రాక్టర్లు చెపుతున్నారని నారాయణ ఆరోపించారు. ఆ తర్వాత సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కేంద్రానికి లేఖ రాశామని వారు రోడ్లు పనులు మొదలు పెట్టకపోవడం పై సమగ్ర విచారణ జరిపి తక్షణమే పనులు చేపట్టాలని ఆదేశించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం అన్నారు. ఇప్పటికైనా స్పందించి తమ గ్రామంలో సిసి రోడ్డు పనులు పూర్తి చేయాలని తాను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.