Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Telangana కాంగ్రెస్ పాలనపై డిప్యూటీ సీఎం ట్వీట్..?

కాంగ్రెస్ పాలనపై డిప్యూటీ సీఎం ట్వీట్..?

by Rama
bhatti vikramarka

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులయింది. కాంగ్రెస్ నెల రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది ప్రజల ప్రభుత్వం.. ప్రజల పాలనలో వారి కలలను నిజం చేయడమే లక్ష్యంగా చేసుకుని పని చేస్తున్నాము. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఇచ్చిన అధికారంతో విర్ర వీగకుండా వెన్నులో భయం పెట్టుకొని పని చేస్తామని ఆయన రాసుకొచ్చారు. అలాగే 10 సంత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పు నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడ్తామని భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, అప్పుల ఊబిలోకి నెట్టినప్పటికీ ఉద్యోగులకు రెండో తేదీన జీతాలు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్‌ది. ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ నా కోసం ఏర్పాటు చేశారని ప్రతి పౌరుడు అనుకునే విధంగా మా పరిపాలన సాగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్వీట్ చేశారు.

Advertisements

You may also like

Our Visitor

019235
Total views : 90135

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.