92
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారయింది. ఈ నెల 19న ఆయన దేశ రాజధానికి వెళ్లనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. మంత్రివర్గ విస్తరణ గురించి హైకమాండ్ తో ఆయన చర్చించనున్నారు. మంత్రివర్గ కసరత్తు ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. హోం, విద్య, సాంఘిక సంక్షేమం, మున్సిపల్ వంటి కీలక శాఖలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. నామినేటెడ్ పదవుల గురించి కూడా అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉంది. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పదవుల పంపిణీ జరగనున్నట్టు సమాచారం.