తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఆయన నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు వచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వీరు తరలి వచ్చారు. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని… తమ గోడును ముఖ్యమంత్రికి చెప్పుకునేందుకు వచ్చామని ఈ సందర్భంగా వారు తెలిపారు. చిన్నచిన్న కారణాలతో దాదాపు పదిహేను వందల మందిని ఉద్యోగాల నుంచి తీసేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు. రేవంత్ ఇంటి వద్ద వారిని అడ్డుకున్న పోలీసులు… సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ముగ్గురికి అనుమతిని ఇచ్చారు.
Telangana Chief Minister Revanth Reddy
ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అప్పగించడంపై వైఎస్ షర్మిల స్పందించారు. తనపై నమ్మకం ఉంచిన ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం అందించేలా పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో, విధేయతతో పనిచేస్తానని హామీ ఇస్తున్నానన్నారు. ఈ సందర్భంగా తాను మాణిక్యం ఠాగూర్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికుడితో కలిసి చేయి చేయి కలిపి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని తెలిపారు. అంతేకాదు, మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు గారు, రాష్ట్రంలోని ఇతర కాంగ్రెస్ నేతలందరి మద్దతును తాను కోరుకుంటున్నానని… వారందరి సహకారంతో నిర్దేశిత లక్ష్యాలను అందుకునేలా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానంటూ షర్మిల ట్వీట్ చేశారు. ఏపి పీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల కు శుభాకాంక్షలు.. ఆల్ ది వెరీ బెస్ట్’ అంటూ ట్వీట్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారయింది. ఈ నెల 19న ఆయన దేశ రాజధానికి వెళ్లనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. మంత్రివర్గ విస్తరణ గురించి హైకమాండ్ తో ఆయన చర్చించనున్నారు. మంత్రివర్గ కసరత్తు ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. హోం, విద్య, సాంఘిక సంక్షేమం, మున్సిపల్ వంటి కీలక శాఖలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. నామినేటెడ్ పదవుల గురించి కూడా అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉంది. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పదవుల పంపిణీ జరగనున్నట్టు సమాచారం.






Total views : 78452