106
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో నాయ్యబద్దంగా నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలపై సాటి మహిళలు అని కూడా కనికరం లేకుండా అసభ్యకరమైన వాఖ్యలు చేసినందుకు నిరసనగా అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖా మంత్రి ఉషా శ్రీ చరణ్ ఫోటోకి చెప్పుల దండ వేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద 12 వ రోజు నిరసన కార్యక్రమాలు నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్ లు పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.