శ్రీ దేవి నల్లపోచమ్మ శ్రీ శివలింగేశ్వర స్వామి దేవాలయం 26 వ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు మూడు రోజులపాటు నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు అశోక్, యాదవ రావులు తెలిపారు. రెండో రోజు శ్రీ లక్ష్మీనరసింహ సహిత మృత్యుంజయ హోమం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసిన బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ కు ఆలయ ప్రధాన అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి, ఆలయ కమిటీ సభ్యులు శాలువతో జంపన ప్రతాప్ ను సన్మానం చేశారు. మొదటిరోజు మహాగణపతి సహిత నవగ్రహ హోమం నిర్వహించడం జరిగిందని, మూడవరోజు ఆదివారం ఉదయం 8 గంటలకు మహా చండీ హోమం, వివిధ ప్రత్యేక పూజలు ఉంటాయని, తదనంతరం అన్నప్రసాద కార్యక్రమాలు ఉంటాయని, ఆలయ కమిటీ సభ్యులు అశోక్, యాదవరావులు తెలిపారు.
శ్రీ శివలింగేశ్వర స్వామి దేవాలయం 26 వ వేడుకలు…
92