ఆత్మహత్య (Suicide):
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండల పరిధిలోని డోవూరు గ్రామానికి చెందిన శిరీష 17 సంవత్సరాలు ఈమె నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ లో పియుసి మొదటి సంవత్సరంలో చేరింది, గురువారం రాత్రి ఆమె గదిలో ఉరివేసుకొని మృతి చెందినట్లు హాస్టల్ సిబ్బంది తెలిపారు, దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి, అదే గ్రామానికి చెందిన ఆకాష్ నారాయణఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుండేవాడు, గత వారం రోజుల క్రితం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ నేపథ్యంలో ఇంటి నుండి హాస్టల్ కి వెళ్ళిన శిరీష గురువారం రాత్రి సూసైడ్ నోట్ లో అమ్మానాన్న సారీ అంటూ, బావ లేని జీవితం నాకు వద్దు అని రాసి మనస్థాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.