71
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిను స్టేట్ ఇన్ఫెక్షన్ కంట్రోలర్ టీం అధికారులు డాక్టర్ సారధి, డాక్టర్ సందీప్ నేతృత్వంలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వైద్యులను, అక్కడ సిబ్బంది ను రోగులకు అందిస్తున్న సేవలు, ముఖ్యంగా సిబ్బంది ఇన్ఫెక్షన్ పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. క్యాజువాలిటీలో అపరిశుభ్రత ఉండటంతో సిబ్బంది పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు సేవలు అందించడం ఎంత ముఖ్యమో అక్కడ పని చేసే వైద్యులు, సిబ్బంది, శానిటేషన్ వర్కర్లు, కుడా అంతే జాగ్రత్త గా ఉండాలన్నారు. ఆసుపత్రి ఆవరణంలో ఎవరికీ కుడా ఇన్ఫెక్షన్స్ సోకకుండ చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.