జగన్మోహన్ రెడ్డి తన స్వార్దం కోసం కోడి కత్తి శ్రీనివాసరావు ను బలిపశువును చేసారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. దళిత వర్గాలకు మేలు పేరుతో దగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికార కాంక్షకు శ్రీను బలయ్యాడన్నారు. చిన్న ఆయుధంతో తనపై హత్యా ప్రయత్నం జరిగిందని సానుభూతి నాటకాలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అతని కుటుంబాన్ని రోడ్డుకి ఎక్కించారన్నారు. చెయ్యని తప్పుకు విడుదలకు అవకాశం లేకుండా జైల్లో ఉంచే కుట్ర జగన్మోహన్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ ఒక్క దళితులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క భారతీయునికి ఆరాధ్యుడన్నారు. మహనీయుని రాజ్యాంగ అమలు వలనే అందరూ సుభిక్షంగా ఉన్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డికి అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఎటువంటి అర్హత లేదన్నారు. ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంత్ బాబును బెయిల్ పై విడుదల చేసి తన కార్యక్రమంలో ఉంచిన వ్యక్తి జగన్మోహన రెడ్డి అని అన్నారు. దళితుడిని చంపిన వాడికి అందలం చిన్న కోడి కత్తితో గుచ్చిన వాడికి జైలా? ఇంతలా దళితులను మోసం చేస్తూ అంబేడ్కర్ విగ్రహం ప్రారంభమా? దళిత డాక్టర్ నూ అన్యాయంగా చనిపోయాలే చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి పాలన ఎవరు మరచిపోరని మండిపడ్డారు.
andhra news
నంద్యాల జిల్లా నంద్యాలలో జేసీ బంగ్లాను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని అందులో ఇది ఒకటిని ఆయన పేర్కొన్నారు. బిల్డింగ్ ని కేవలం కోటి రూపాయలతోనే సుందరవణంగా తీర్చిదిద్దామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, జిల్లా కలెక్టర్ మంజీర జిలానీ, జెసి రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 21న రాష్ట్ర పర్యటనలో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి నంద్యాలకు విచ్చేస్తున్నారని బిజెపి నంద్యాల కన్వీనర్ అభిరుచి మధు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురందేశ్వరి మేడం నంద్యాలకు రాగానే బిజెపి కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో మొదలై రాష్ట్రవ్యాప్తంగా వాలంటరీ కార్యక్రమం జరుగుతుందని ఇక్కడి నుంచి బూత్ కమిటీ సభ్యులను, పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్లతో, నాయకులతో, అభిమానులతో, కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి పట్టణంలోని పలు కూడళ్లలో తిరిగి చివరగా సౌజన్య కన్వెన్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలో రాజోలు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు కార్యకర్తలు గౌరవ వేతనం వద్దు కనీస వేతనం ముద్దు అంటూ సిఐటియు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 39 రోజులు నుంచి విరామం లేకుండా శాంతియుతంగా సమ్మె నిర్వహిస్తున్నటువంటి తమకు ఫోకస్ నోటీసులు జారీ చేసి తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఆరుసార్లు చర్చలకు పిలిచి తమకు ఎటువంటి న్యాయం చేయలేదని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ వర్కర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కి వినిపించడం లేదా అక్కా చెల్లెళ్ళు ఆడపడుచులు చేస్తున్నటువంటి సమ్మె జగన్మోహన్ రెడ్డి కి కనిపించడం లేదా అని రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెబుతాం అని అంగన్వాడి వర్కర్స్ వాపోతున్నారు.
స్థానిక టిడిపి కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలోమాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ దళితులను జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో 125 వేల అడుగులకు అనిచివేసి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే దళితులకు మీరు చేసిన పాపాలన్ని తొలగిపోతాయ అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు దళితులను గౌరవిస్తూ విదేశీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టి పది నుండి 15 లక్షలు విదేశీ విద్యకు విధులు కేటాయించి పేదలకు విదేశీ విద్య అందించడం జరిగిందని అటువంటి పథకానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోవడం దళితులకు అగౌరవం అన్నారు. టిడిపి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అనేకమందికి రుణాలు అందించి ఆదుకుంటే వైసిపి పాలనలో జగన్ రెడ్డి కార్పొరేషన్ నిధులు కేటాయించకుండా దగా చేశాడని ఎద్దేవా చేశారు. 50 వేల బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉంటే దళితులపై ప్రేమ ఉన్న జగన్ రెడ్డి ఐదేళ్లలో ఎందుకు భర్తీ చేయలేదు అని ప్రశ్నించారు. దళిత వాడలకు 200 యూనిట్లు లోపు కరెంటు ఉచితంగా చంద్రబాబు నాయుడు నాడు అందిస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం ఉచిత కరెంటు ఎత్తివేసి అధిక బిల్లులతో దళితులను దోపిడీ చేశారని అన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టినంతమాత్రాన చేసిన దుర్మార్గాలను మర్చిపోరని, అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేక పాలన సాగిస్తున్న జగన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించే నైతిక హక్కు లేదని అన్నారు.
తెలుగుదేశంపార్టీ ఆదేశాలతో కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ రూరల్ మండలం ఇంద్ర పాలెం గ్రామంలో పిల్లి అనంతలక్ష్మి సత్యనారయణ మూర్తి కళ్యాణ మండపంలో టి.డి.పి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో జయహో బీసీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజి మంత్రి పితాని సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ బిసి సాధికార శెట్టి బలిజ విభాగం కుడిపుడి సత్తిబాబు, కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి లాల్ పులే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి సముచిత స్థానం తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు ఎన్టీఆర్, చంద్రబాబు కల్పించారన్నారు. వైసిపి పాలనలో బీసీలు వెనకబడి పోయారని, బీసీ సంక్షేమానికి ఆనాడు చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు, వివిధ కార్పొరేషన్ ల ద్వారా చేయూత అందించారని, నేడు రాష్ట్ర ప్రభుత్వం అవి అన్నీ అమలు చేయకుండా బీసీలను చిన్న చూపు చూస్తోందన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా బీసీలు అందరు ఎకతాటిపైకి వచ్చి తెలుగుదేశం పార్టీ కి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు చొలంగి వేణుగోపాల్, టిడిపి నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, చప్పిడి వెంకటేశ్వరరావు, రామకృష్ణ, అధిక సంఖ్యలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం యోగి వేమారెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రెసిడెంట్ చెంగారెడ్డి మాట్లాడుతూ యోగి వేమన పద్యాలు సులువుగా నేర్చుకోవచ్చు దాని తాత్పర్యం అర్థం అవుతుంది. వేమన అంటే ఒక మహాకవి ఒక జ్ఞాని అని తెలిపారు. వేమన పద్యాలు అంటే అందరికీ ఇష్టమే అంటూ ఆయన తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ రెడ్డి మాట్లాడుతూ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఎన్నో సంక్షేమ పనులు చేశామని మేము రెడ్డి కులస్తులనే కాదు ఆదుకునేది అన్నీ కులస్తులను మేము ఆదుకుంటామని ఆయన తెలిపారు. స్కూల్ పిల్లలకు విజయ సాధన అనే బుక్స్ పంపిణీ చేశారు. పేదలకు, ముసలి వాళ్లకు రగ్గులు, బెడ్ షీట్లను ఉచితంగానే అందజేశారు.
పత్తికొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ ఇంచార్జ్ కె యి శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో రాంపల్లి గ్రామానికి చెందిన మద్దికేర సూరన్న, ఊరు ఆవుల పెద్దయ్య, కురువ రంగన్న, కురువ మల్లికార్జున, మద్దికేర ఓబులేసు, మారికి కోదండ బావిగడ్డ పెద్ద ఓబులేసు, ఏకాశి ప్రసాద్, ముట్టి వెంకట్ రాముడు, మద్దికేర పరుశురాముడు, కిష్టయ్య, బుగ్గల బ్రహ్మయ్య, మహేష్ మద్దికేర సుఖాలు, మారికి పెద్దయ్య, చిట్యాల రంగన్న, చందోలి గ్రామానికి చెందిన సలీం తదితరులు వారి 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగింది.
ఆస్తికోసం కన్నతల్లిని కడతేర్చిన సంఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో చోటుచేసుకుంది. తుగ్గలి మండలం రాతన కొత్తూరుకు చెందిన లక్ష్మీదేవిని(55) పొలాన్ని తన పేరు పైకి మార్పించాలని ఒత్తిడి చేస్తూ ఆమె ఒప్పుకోకపోవడంతో కొడుకు లిఖిత్ రెడ్డి ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు. లక్ష్మీదేవికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. కొంతకాలం కిందటే భర్తను పోగొట్టుకున్న లక్ష్మీదేవి కూతురికి పెళ్లి చేసింది. ఆ తర్వాత పొలాన్ని తన పేరు పైకి మార్చాలని తల్లితో తరచుగా లిఖిత్ రెడ్డి గొడవపడేవాడు. కొడుకుతో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేక రాతనలోని తన బంధువుల ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. అయితే గత రాత్రి తల్లికి ఫోన్ చేసి పెళ్లి సంబంధానికి వస్తున్నారని రావాలని చెప్పాడు. హత్య చేయాలని ఉద్దేశంతోనే తనను రమ్మన్నాడని తెలుసుకోలేని తల్లి స్వగ్రామానికి వచ్చింది. ముందుగానే అనుకున్న ప్రకారం ఇంటికి చేరుకున్న లక్ష్మీదేవిని వ్యవసాయానికి వాడే ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. గ్రామస్తులకు విషయం తెలియడంతో అక్కడికి చేరుకునే లోపు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రధానంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా పాదయాత్ర చేపడుతున్నట్లు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం, మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడం ఎజెండాగా పాదయాత్ర చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ నెల 28వ తేదీ నుండి పాదయాత్ర మొదలుపెట్టి నియోజకవర్గంలోని ప్రజలకు వెలుగొండ ప్రాజెక్టు ప్రాధాన్యత మరియు మార్కాపురం జిల్లా ఆవశ్యకత గురించి వివరిస్తూ ముందుకెళ్లడం జరుగుతుందన్నారు. ఈ పాదయాత్రలో కలిసి వచ్చే పార్టీలను అన్నింటిని కలుపుకొని ప్రజల్లోకి వెళ్లడం జరుగుతుందన్నారు. పాదయాత్ర రూట్ మ్యాప్ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





Total views : 54434