విజయవాడకు సుజనా చౌదరి (Sujana Chowdary) పక్కా లోకల్ అని, 30వేల ఓట్ల మెజారిటీతో పశ్చిమలో ఎన్డీఏ గెలుపు ఖాయమని పశ్చిమ బీజేపీ నేతలు జోస్యం చెప్పారు. వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. పోతిన మహేష్ వైసీపీ నుంచి ప్యాకేజీ తీసుకుని ఎన్డీఏకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా, ఎవరూ నమ్మే స్థితిలో లేరని బీజేపీ నేతలు అన్నారు. సుజనా చౌదరి నాన్ లోకల్ అని జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ నాయకులు ఖండించారు. భవానీపురం బీజేపీ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, సీనియర్ నేతలు పైలా సోమినాయుడు, పోతిన వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. సుజనా చౌదరి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అడ్డూరి శ్రీరామ్ జోస్యం చెప్పారు. ప్రలోభాలకు నగరాలు లొంగుతున్నారన్న ఆరోపణలను శ్రీరామ్ తీవ్రంగా ఖండించారు. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే సహించేది లేదని వైసీపీ నేతలను శ్రీరామ్ హెచ్చరించారు. సుజనా ఇప్పటికే ప్రజల మనసు గెలుచుకున్నారన్నారు. సుజనా పక్కా లోకల్ అని పైలా సోమినాయుడు అన్నారు. సుజనా స్వగ్రామం విజయవాడకు కూతవేటు దూరంలోనే ఉందని, ఆయన తండ్రి విజయవాడ పాల ప్రాజెక్ట్ లో ఇంజనీర్ గా పనిచేశారని, సుజనా కుటుంబాలు విజయవాడ లోనే ఉన్నాయని పైలా గుర్తు చేశారు. వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ కు రాజకీయ అవగాహన లేదని, ఆయన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సోమినాయుడు అన్నారు. విజన్ ఉన్న నాయకుడు సుజనా అని, అందుకే తాము ఆయనకు మద్దతు పలికామని చెప్పారు. పోతిన మహేష్ మాటలను ఎవరూ పట్టించుకోరని, ఆయన మాటలకు విలువలేదని వెంకటేశ్వరరావు దుయ్యబట్టారు. ఈ సమావేశంలో పోతిన బేస్ కంఠేశ్వరుడు, రాంపిల్ల శ్రీను, బెవర శ్రీను, పీసా కుట్టి పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…