ఉదయగిరి పట్టణంలో దిలార్ బావి వీధి ముస్లిం కాలనీలో ఆరవ రోజు కొనసాగిన ప్రజా దీవెన యాత్ర కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకటరామారావు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పథకాన్ని ఆ ప్రాంత ప్రజలకు వివరిస్తూ టిడిపి ముద్రించిన కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉదయగిరి పట్టణంలో చాలా సమస్యలు పేరుకు పోయాయన్నారు. ఎక్కడ చూసినా మురికి నీరు విజృంభిస్తుందని సరైన కాలువలు లేక రోడ్ల మీదకి మురికి నీరు వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీరు చూస్తే మూడు, నాలుగు రోజులకు వస్తున్నాయంటూ ఆవేదన చెందారు. తాను అధికారంలో ఉన్నప్పుడు త్రాగునీరు కోసం నియోజకవర్గానికి 460 కోట్ల రూపాయలతో మంచి నీటి పథకాలు తెస్తే దానిని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కనపెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఎద్దెవ చేశారు. ఉదయగిరి నా అడ్డ అని చెప్పుకు తిరుగుతున్న వైసీపీ నాయకుడు ఈ ప్రాంత అభివృద్ధికి ఏం చేశాడో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దొంగ సిమెంట్ పట్టుకుంటే మా నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనయించడం తనకే చెల్లిందన్నారు. ఉదయగిరికి ఓ చరిత్ర ఉంది అది తెలుసుకుని మసులుకో అంటూ పరోక్షంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డిని హెచ్చరించారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపిస్తే అన్ని హంగులతో ఉదయగిరి ప్రాంతాన్ని తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, మండల కన్వీనర్ బొజ్జ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
ఆదరించండి ఆగిన అభివృద్ధిని కొనసాగిస్తా…
63
previous post