ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఏడు లక్షల కోట్ల అప్పులు చేశామని ఒకరంటే, 10 లక్షల కోట్లు అని ఇంకొకరు అంటున్నారనీ, వైసీపీ ప్రభుత్వం ఏకంగా 13 లక్షల కోట్ల అప్పులు చేసిందని చంద్రబాబు అంటున్నారని బుగ్గన చెబుతూ అసలు ఏ ప్రాతిపదికన ఇలా అంటున్నారని నిలదీశారు. కోవిడ్ సమయంలో రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలమైన విషయం నిజమేనని ఆయన అన్నారు. అయితే తెలుగుదేశం హయాంతో పోలిస్తే వైఎస్ఆర్ సీపీ అధికారంలో ఉన్న ఈ నాలుగేళ్లలో చేసిన అప్పులు తక్కువేనన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న 2014-2019 మధ్య కాలంలో అప్పులు 22 శాతం పెరిగితే, ఈ నాలుగున్నరేళ్ల కాలంలో పెరిగిన అప్పులు 12 శాతం మాత్రమేనని మంత్రి వివరించారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో రెవెన్యూ రాబడి 6 శాతంగా ఉందని, వైసీపీ ప్రభుత్వంలో 16.7 శాతంగా రెవెన్యూ రాబడి ఉందని తెలియజేశారు. 2018-19 చంద్రబాబు నాయుడి పాలనలో 5.3 శాతం నిరుద్యోగిత ఉందని, 2018-19లో 44 లక్షల 86 వేల పిఎఫ్ అకౌంట్లు ఉన్నాయన్నారు.
వైసీపీ ప్రభుత్వం
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను భయపెట్టి జగన్ పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు గ్రామం నుంచి తన రెండో రోజు పాదయాత్ర ప్రారంభించారు. ఓట్ల కోసం నా ఎస్సీ, నా ఎస్టీ, నాబీసీ, నా మైనార్టీ అంటూ ప్రేమ కురిపించి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గాలన్నింటినీ జగన్ మోసం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని 33 వేల మందిపై దాడులు జరిగాయని ఆరోపించారు. జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఆయన ను ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
బాపట్ల నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ పూనుకున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం మీ మాటే – నా బాట, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం లో భాగంగా నేడు బాపట్ల మండలం మురుకుండపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి వెళ్లి తెలుగుదేశం పార్టీ విధి విధానాలు వివరిస్తూ మహిళలకు చీర, నిత్యావసర వస్తువులు తెచ్చుకునే సంచి, తన గురించి తెలియజేసే కరపత్రాన్ని అందజేసి ఆశీర్వదించమని కోరారు. అనంతరం భవిష్యత్ కు గ్యారంటీ పత్రాలలో వారి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి భవిష్యత్తు గ్యారెంటీ సంక్షేమ పథకాలు గురుంచి బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ వివరించారు. ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ… ప్రజలలో వైసిపి ప్రభుత్వం పై తిరుగుబాటు మొదలైందని రాబోయే రోజులో వైసీపీ ప్రభుత్వ పతనము అవుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం లో మురుకుండపాడు గ్రామము నందు ఒక్క అభివృద్ధి పని జరిగినట్లు కూడా చెప్పట్లేదు. కానీ తెలుగుదేశం ప్రభుత్వములో రోడ్లు వేసి అభివృద్ధి చేశామన్నారు. గత కొన్ని రోజుల క్రితం గ్రామములో విష జ్వరాలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడ్డారు కానీ వైసిపి ప్రభుత్వం కనీసం వారిని పట్టించుకోలేదన్నారు. ప్రజల్లో మార్పు వచ్చిందని కచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ అరాచక పాలనకు తగిన గుణపాఠం చెపుతారన్నారు. మీ అందరికి తను అండగా ఉంటానని మురుకుండపాడు గ్రామాన్ని అభివృద్ధి చేసే భాద్యత తనదని హామీ ఇచ్చారు.
అంగన్వాడీల పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. అంగన్వాడీల పోరాటానికి శుక్రవారం మాజీమంత్రి, టీడీపీ నాయకులు మద్దతు ప్రకటించారు. అంగన్వాడీల నిరసన శిబిరాన్ని టీడీపీ నాయకులతో కలిసి మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో లబ్ది కోసం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. ఎన్నికల హామీను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై ఉందన్నారు. ఐదేళ్ల సమయం లో అంగన్వాడీల సమస్యను పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు రాని సీఎం ఎన్నికల్లో బయటకు రావడం తప్పనిసరి అని తెలిసి అంగన్వాడీలు బయటకు వచ్చారన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, జగనన్న కాలనీ పేరుతో ముఖ్యమంత్రి, మంత్రులు జేబులు నింపుకొంటున్నారని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేతకదాని ఆరోపించారు. దోపిడీని ఆపితే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించవచ్చునన్నారు. ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, రైతుల్లో అసంతృప్తి వచ్చిందన్నారు. అంగన్వాడీలు, మున్సిపల్, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సహకరించకుండా ఐదేళ్లు పాలన చేశారా అని ప్రశ్నించారు. అంగన్వాడీలను తొలగించే హక్కు ఎవరికి లేదన్నారు. అంగన్వాడీలకు టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు. ఒక్కసారి మోస పోవడం సహజం రెండోసారి మోసపోకుండా వైసీపీకు బుద్ది చెప్పాలని కోరారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పారు. మూడు నెలల్లో టీడీపీ ప్రభుత్వం అధికారం లోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఉదయగిరి పట్టణంలో దిలార్ బావి వీధి ముస్లిం కాలనీలో ఆరవ రోజు కొనసాగిన ప్రజా దీవెన యాత్ర కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకటరామారావు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పథకాన్ని ఆ ప్రాంత ప్రజలకు వివరిస్తూ టిడిపి ముద్రించిన కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉదయగిరి పట్టణంలో చాలా సమస్యలు పేరుకు పోయాయన్నారు. ఎక్కడ చూసినా మురికి నీరు విజృంభిస్తుందని సరైన కాలువలు లేక రోడ్ల మీదకి మురికి నీరు వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీరు చూస్తే మూడు, నాలుగు రోజులకు వస్తున్నాయంటూ ఆవేదన చెందారు. తాను అధికారంలో ఉన్నప్పుడు త్రాగునీరు కోసం నియోజకవర్గానికి 460 కోట్ల రూపాయలతో మంచి నీటి పథకాలు తెస్తే దానిని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కనపెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఎద్దెవ చేశారు. ఉదయగిరి నా అడ్డ అని చెప్పుకు తిరుగుతున్న వైసీపీ నాయకుడు ఈ ప్రాంత అభివృద్ధికి ఏం చేశాడో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దొంగ సిమెంట్ పట్టుకుంటే మా నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనయించడం తనకే చెల్లిందన్నారు. ఉదయగిరికి ఓ చరిత్ర ఉంది అది తెలుసుకుని మసులుకో అంటూ పరోక్షంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డిని హెచ్చరించారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపిస్తే అన్ని హంగులతో ఉదయగిరి ప్రాంతాన్ని తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, మండల కన్వీనర్ బొజ్జ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
రైల్వే కోడూరు పట్టణంలో సాధికార బస్సు యాత్రను ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సర కాలంలో వైసిపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడానికే ఈ సాధికార యాత్ర అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద ప్రజలకు అండగా వైసీపీ ప్రభుత్వం ఉంటుందని ఆయన అన్నారు. ఈ సాధికార యాత్రలో ముఖ్య అతిథిగా ఎలక్ట్రానిక్ మీడియా అధికార ప్రతినిధి, సినీ నటుడు ఆలీ పాల్గొన్నారు. రైల్వే కోడూరు రాజ్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ దగ్గర నుండి టోల్గేట్ దగ్గర ఏర్పాటు చేసిన మహాసభ వరకు ఈ ర్యాలీని నిర్వహించారు. అడుగడుగునా ఈ ర్యాలీలో ప్రజలు ఆలీకి బ్రహ్మరథం పడుతూనే నీరాజనాలు పలికారు. కేరళ వాయిద్యాలతో, భజన కోలాటాలతో, డీజే పాటలతో కోడూరు పట్టణం దద్దరిల్లిపోయింది. పలుచోట్ల ఆలీకి గజమాలలతో సత్కారం చేసారు.
వైసిపి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టిన దాడులు నిర్వహించిన పారిపోమని టిడిపి ఓట్లను తొలగించడం, ఓట్లు వేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నించడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. పల్నాటి ప్రజలు టిడిపి పార్టీని ఆదరించారని ప్రజలు కష్టాల్లో ఉన్నారని వారికి టిడిపి పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఇంకొక మూడు నెలలు ఓపిక పట్టండని నష్టపడ్డ ప్రజలకు, ప్రతి టిడిపి కార్యకర్తకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటామని అన్నారు. ఓటమి భయం వైసిపి పార్టీని వెంటాడుతుందని వ్యవస్థలను వెంటబెట్టుకుని అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో టిడిపి జనసేన సంకీర్ణ ప్రభుత్వం రావడం ఖాయమని ప్రజలు, కార్యకర్తలు భయపడవద్దని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేసిన కూడా లోకేష్ పాదయాత్ర బ్రహ్మాండంగా జరిగిందని అది జీర్ణించుకోలేని వైసిపి ప్రభుత్వం వారు పాదయాత్ర మొదలు పెట్టిన దగ్గర నుండి ఎద్దేవా చేస్తూనే ఉన్నారని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు తమ ఓటు హక్కుతో వైసిపి ప్రభుత్వంకు ఓటమిని 70mm లో సినిమా చూపిస్తారని ఆయన అన్నారు.