70
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. 200 మంది నీరుపేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు 77 వ జన్మదినం సందర్బంగా రేవంత్ రెడ్డి ప్రజల అండతో తెలంగాణ గెలుపును బహుమతిగా ఇచ్చామన్నారు. సోనియా గాంధీ పుట్టిన రోజు నాడే 6 గ్యారంటీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ భీమా 10 లక్షలకు పెంపు పథకాలను ప్రారంభించడం సంతోషమన్నారు. తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు సోనియా గాంధీ పుట్టినరోజును పండగ లా జరుపుకుంటున్నారన్నారు.