కొత్తగూడెం జిల్లా గ్రంథాలయంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.

కొత్తగూడెం జిల్లా గ్రంథాలయంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

Advertisements

<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని నూతన జిల్లా గ్రంథాలయంలో 10 లక్షల రూపాయల ఎంపీ లాడ్స్ రాజ్యసభ నిధులతో నిర్మించనున్న ప్రహరీ గోడ పనులకు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి శంకుస్థాపన చేశారు&period; ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాం రెడ్డి పాల్గొన్నారు&period;ఎస్‌ఐఆర్ ప్రక్రియను సీరియస్‌గా తీసుకోవాలని&comma; ఓటు హక్కును కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు&period; పిల్లల విద్యాభివృద్ధి&comma; జిల్లా అభివృద్ధికి తాను కృషి చేస్తున్నానని తెలిపారు&period;అనంతరం గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై రేణుకా చౌదరి విమర్శలు చేశారు&period; ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు చేస్తున్నప్పటికీ దేశ సమస్యలపై సరైన స్పందన లేదని ఆరోపించారు&period; విదేశాంగ విధానం దారుణంగా ఉందని&comma; నేపాల్ వంటి దేశాలు కూడా భారత్‌ను బెదిరించే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు&period;పెట్రోల్&comma; డీజిల్ à°§à°°à°² పెరుగుదలతో సామాన్య ప్రజలపై భారం పడిందని&comma; గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు&period;ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులు&comma; గాంధీ కుటుంబంపై విమర్శలు చేస్తోందని ఆరోపించారు&period; త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని రేణుకా చౌదరి జోస్యం చెప్పారు&period;బెంగాల్&comma; బీహార్ రాష్ట్రాల్లో రాత్రికి రాత్రే లక్షలాది ఓట్లు తొలగించారని ఆరోపించిన ఆమె&&num;8230&semi; తెలంగాణలో కేంద్రం ప్రయత్నాలు ఫలించవని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పంచదార్ల కొండను నాన్‌మైనింగ్ జోన్‌గా మార్పు – కొల్లు.

అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.

ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ఏపీ మంత్రులు కీలక భేటీ.