ఓడినందుకు కుంగిపోవద్దని… వచ్చే పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిద్దామన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. సంగారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… 2004లో కాంగ్రెస్ మనతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసిందని, తెలంగాణపై కేసీఆర్‌కి ఉన్న ప్రేమ ఇతరులకు ఉండదని వ్యాఖ్యానించారు. తెలంగాణాని అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశమిచ్చారని, మనకంటే బాగా పని చేయాలని కోరుకుందామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీల అమలు కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడే వారికి భవిష్యత్తు ఉంటుందని, ఆ అవకాశం మనకు ఉందన్నారు. కార్యకర్తలు ఎవరూ కూడా అధైర్యపడవద్దని, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని, అందరం కలసి పని చేద్దామన్నారు. ఓటమిపై సమీక్ష జరుపుకుందామని, తప్పొప్పులు సరిచేసుకొని ప్రజల పక్షాన నిలబడుదామన్నారు.
ప్రజా సమస్యలపై పోరాడే వారికే భవిష్యత్తు…
74
previous post