ఎన్నికల వేళ… రాజధాని అంశం మరోసారి తెరపైకి

At the time of the election...the issue of the capital once again came to the fore

Advertisements

&NewLine;<p>ఏపీలో ఎన్నికల వేళ…రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చింది&period; అమరావతినే కొనసాగించాలని పవన్&comma; చంద్రబాబు పట్టు పడుతుండగా జగన్ మాత్రం ససేమిరా అంటున్నారు&period; విశాఖనే ఏపీకి రాజధాని అంటూ మరోసారి కుండబద్దలు కొట్టారు&period; అంతేకాదు&period;&period; సీఎంగా విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానంటున్నారాయన&period; మరోసారి న్యాయ&comma; శాసన రాజధానులపైనా సీఎం వైఎస్ జగన్ మనసునలోని మాట విప్పేశారు&period; కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందన్నారు&period; అమరావతి కేవలం శాసన రాజధాని మాత్రమే అని చెప్పారు&period; ఈ లెక్కన మూడు రాజధానుల నినాదంతోనే తాను ఎన్నికలకు వెళ్తున్నట్లు జగన్ చెప్పకనే చెప్పేశారు అంటే తాను గెలిస్తే మూడు రాజధానులకు ప్రజలు ఓటేసినట్లే అనేది ఆయన భావన&period; ఇదే తరుణంలో అమరావతే రాజధాని అంటున్నారు పవన్&comma; చంద్రబాబు&period; వచ్చే ఎన్నికల్లో గెలవబోయేది తామే అని&comma; తాము అధికారంలోకి వచ్చీ రాగానే అమరావతికి పట్టం కడతామని చంద్రబాబు చెబుతున్నారు&period; దీంతో ఎన్నికల్లో ఏపీ రాజధాని అంశం కీలక పాత్ర పోషించబోతోంది&period; జగన్ విశాఖ&comma; పవన్&comma; చంద్రబాబు జై అమరావతి అంటుంటే జగన్ మాత్రం జై వైజాగ్ అంటున్నారు&period; ఏపీ ప్రజల్లో మాత్రం అమరావతి ఫీలింగే బలంగా ఉందని పవన్&comma; చంద్రబాబు నమ్ముతున్నారు&period; ఈ తరుణంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువైపు&quest; వారి నిర్ణయం ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.