ఎన్ డి ఎ కూటమి (NDA Alliance) :
ప్రకాశం జిల్లాలో రెండు నిండు ప్రాణాలను ఎన్ డి ఎ కూటమి (NDA Alliance) ఉమ్మడి అభ్యర్థి డా. గొట్టిపాటి లక్ష్మి కాపాడారు. వివరాల్లోకి వెళ్తే… ఎన్. డి. ఎ కూటమి ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గురువారం కురిచేడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం సమయం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కి ఫోన్ వచ్చింది. దాని ప్రకారం దర్శి మండలం లోని అబ్బయపాలెం కు చెందిన దర్శి వెంకట రమణ అనే మహిళకు పురిటి నొప్పులు రావటం తో స్థానిక ఎస్. ఎస్. ఆర్ హాస్పిటల్ కు బంధువులు తీసుకువచ్చారు. ఉమ్మ నీరు చేరింది. అర్జెంటు గా ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
వెంటనే ఒంగోలు గాని గుంటూరు తీసుకువెళ్ళాలని.. లేకపోతే ప్రాణాలకు ప్రమాదం అని నిర్ధారించడంతో… విషయం తెల్సుకున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వెంటనే రంగంలోకి దిగారు. ప్రచారం సైతం మధ్యలో నే వదిలేసి… హాస్పటల్ కు వచ్చి మహిళకు విజయవంతం గా సర్జరీ చేశారు. మహిళ పండంటి మగ బిడ్డ కు జన్మనించింది. తల్లి, బిడ్డ ఇరువురు క్షేమంగా ఉన్నారు. డాక్టర్ గా ఎన్నికల ప్రచారంలోనూ తన బాధ్యతను మర్చిపోకుండా ప్రాణాప్రాయంలో ఉన్న గర్భిణీకి విజయవంతంగా ఆపరేషన్ చేయడంపై గొట్టిపాటి లక్ష్మిని.. శభాష్ గొట్టిపాటి అంటూ దర్శి ప్రజలు అభినందిస్తున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: రెండు నిండు ప్రాణాలను కాపాడిన ఎన్ డి ఎ కూటమి…