ప్రతిపక్షాలను బూతులు తిట్టడం కాదు… రైతు సమస్యలు కూడా తీర్చాలి

Review meeting with officials on purchase of grain

Advertisements

&NewLine;<p>ప్రభుత్వ ఆనాలోచన నిర్ణయం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు&period; ఉయ్యూరు ఆర్టీవో కార్యాలయంలో ధాన్యం కొనుగోలు పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు&period; ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తో పాటు ఆర్డిఓ రాజు&comma; ఎమ్మార్వో మస్తాన్ రావు&comma; నగర పంచాయతీ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు&period; ఆర్ బి కే నుండి మిల్లర్లకు తరలించిన ధాన్యం రోజుల తరబడి దిగుమతి చేసుకోకుండా తేమ శాతం పేరుతో బస్తాకు 300 నుంచి 400 రూపాయలు తగ్గించి ఇస్తున్నారని దీనిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు&period; అనంతరం మీడియాతో మాట్లాడిన పార్థసారథి ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు&period; రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించడం లేదని అలాగే తేమశాతం పేరుతో మిల్లర్లు రైతులను మోసగిస్తున్న అధికారులు&comma; మంత్రులు స్పందించడం లేదని అన్నారు&period; పకృతి విపత్తు వల్ల ఈ సంవత్సరం కుప్పనూరుపుళ్ళు మార్చి తర్వాత కూడా జరుగుతాయని కానీ ప్రభుత్వం మార్చి తర్వాత ధాన్యం కొనుగోలు చేస్తామని భరోసాని మాత్రం రైతులకు కల్పించడం లేదని అన్నారు&period; మంత్రులు ప్రతిపక్షాలను బూతులు తిట్టడమే కాదని రైతు సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని చురక అంటించారు&period; ఇక్కడ ధాన్యాన్ని కడప&comma; కర్నూలు&comma; నెల్లూరు మిల్లులకు తరలించి ఇక్కడ మిల్లర్లకు సైతం ప్రభుత్వం అన్యాయం చేస్తుందని సారధి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..