పశ్చిమ గోదావరిజిల్లా నరసాపురం జనసేన కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో వైసీపీ పాలనను అంతమొందించేందుకు టీడీపీ-జనసేన పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పార్టీ అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమిష్టిగా కృషి చేస్తున్నారు. వైసీపీ అరాచక పాలనతో రాష్ట్రం చిన్నాభిన్నంగా మారిందని ఆ పార్టీల ఇన్చార్జిలు పొత్తూరి రామరాజు, బొమ్మిడి నాయకర్, కొవ్వలి యతిరాజా రామ్మోహన్నాయుడు అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఐక్యమత్యంగా పనిచేస్తాయన్నారు. నరసాపురం నియోజకవర్గంలో ఇంకా ఎవరికి టిక్కెటు కేటాయించలేదన్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక్కటైన టీడీపీ-జనసేన అధినేతలు టిక్కెటు ఎవరికి కేటాయించినా ఐక్యమత్యంగా పనిచేసి విజయం సాధిస్తామన్నారు. 50 వేల మెజారిటీతో విజయం సాధించేందుకు కృషి చేస్తామన్నారు. నియోజకవర్గంలో ఇరుపార్టీల నుంచి సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఆరుగురికి స్థానం కల్పించారు. కమిటీ, ఇరుపార్టీల కార్యకర్తలకు నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.
Read Also..