తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..ఉదయం సెక్రటేరియట్ లోని 5 వ అంతస్తులో ఉన్న రోడ్లు భవనాల మంత్రిత్వ కార్యాలయంలో వేద పండితుల సమక్షంలో పూజలు నిర్వహించిన అనంతరం సరిగ్గా 9.45 నిముషాలకు రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసీనులయ్యారు. వేద పండితులు, మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వేద ఆశీర్వచనం చేశారు. మంత్రిగా చార్జి తీసుకున్న అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తమ్ముడు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆ శాఖకు సంబంధించిన అధికారులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి కూడా శుభాభినందనలు తెలిపారు.
అన్న బాధ్యతల స్వీకరణలో పాల్గొన్న తమ్ముడు..
79
previous post