ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ‘పాలమూరు ప్రజాదీవెన’ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సామాన్య కార్యకర్త నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించనని పదవులు కాదు కార్యకర్తలే శాశ్వతమని ఎప్పుడూ నేతలకు చెబుతూ ఉంటానన్నారు. ప్రధాని మోదీకి వినతిపత్రం ఇస్తే కొందరు విమర్శిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని అడగాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా తనపై ఉందని… ఘర్షణ వైఖరి ప్రభుత్వాల మధ్య ఉండొద్దనే వినతిపత్రం ఇచ్చాన్నారు. అడిగిన పనులు చేయకపోతే చాకిరేవు పెడతాం. తెలంగాణ అభివృద్ధికి మోదీ సహకరించకపోతే అన్ని రాష్ట్రాలు తిరిగి మరీ కేంద్రంపై పోరాటం చేస్తానన్నారు. కేటీఆర్, హరీశ్‌రావును చూస్తే.. బీఆర్ఎస్.. బిల్లా రంగా సమితి అనిపిస్తుందనిన్నారు. పాలమూరు ప్రజలు ఇచ్చిన అండతో దేశంలో మోదీ, రాష్ట్రంలో కేడీ తోనైనా కొట్లాడతా. పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు.
దేశంలో మోదీ, రాష్ట్రంలో కేడీ తోనైనా కొట్లాడతా…
101
previous post