కృష్ణాజిల్లా, గుడివాడ నియోజకవర్గం.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము (Venigandla Ramu) ఈరోజు మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం రాము తన ఇంటి వద్ద నుండి భారీ ర్యాలీగా బయలుదేరి నెహ్రూ చౌక్, మార్కెట్ సెంటర్ , ఏజీకి స్కూల్ మీదగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ ర్యాలీలో వెనిగండ్ల రాముతో పాటు మచిలీపట్నం జనసేన పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలసౌరి, మాజీ పార్లమెంటు సభ్యులు కొనకల్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. నామినేషన్ వేసిన అనంతరం రాము మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడను అభివృద్ధిలో 20 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లాడని, తాను గెలుపొందితే గుడివాడను 25 సంవత్సరాల అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. మట్టి మాఫియాగా నాని దోచుకున్నాడని, క్యాసినో, పేకాటలాంటి అసాంఘిక కార్యకలాపాలతో గుడివాడ నాశనం చేశాడని అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి