ముస్లిమ్ మైనార్టీలు విశేషంగా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారని, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముస్లింల సంక్షేమాన్ని విస్మరించిందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. రాయదుర్గం నియోజకవర్గం లోని కనేకల్ మండల కేంద్రంలో తేదేపా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మైనారిటీలు నారా చంద్రబాబు నాయుడు అధికారం లోని రావాలని తేదేపా హయంలో లో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా, రక్షణ గా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. అత్యధికంగా ఉన్న ముస్లిం మైనార్టీలు కనేకల్లో ఏ ఇంటికి వెళ్లిన ప్రజాసారణ లభిస్తాందన్నారు. జగన్ ప్రభుత్వంలో నిత్యవసర సరుకు ధరలు విపరీతంగా పెరిగిపోయాయని పెట్రోల్, డీజిల్ ధరలు 9 సార్లు పెరగడంతోపాటు చివరకు విద్యుత్ చార్జీలు, మద్యం ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్య ప్రజల నడ్డి విరిచిన ప్రభుత్వం వైసిపి ప్రభుత్వం అని మండిపడ్డారు. తెదేపా హాయంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు సమక్షంలో కనేకల్లు రైతులకు సంవత్సరానికి రెండు పంటలు పండే విధంగా చెరువులకు నీరు అందించామన్నారు. అదేవిధంగా హెచ్ ఎల్ సి నీటి వాటా రైతులకు సరిపడే విధంగా అందించామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 50000 మెజారిటీ కి తగ్గకుండా విజయం సాధిస్తామని దిమా వ్యక్తం చేశారు.
మండుటెండల్లో తేదేపా జోరు ప్రచారం…
90