మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బిజెపి విజయ సంకల్ప యాత్ర నేడు జడ్చర్ల నియోజకవర్గానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర బిజెపి కోశాధికారి శాంత కుమార్, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదటగా బాలనగర్ మండల కేంద్రానికి విజయ సంకల్ప యాత్ర చేరుకున్న సందర్భంగా గిరిజన మహిళలు వారికి సాంప్రదాయా నృత్యాలతో స్వాగతం పలికారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ దేశంలో మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కాబోతున్నారని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి పార్టీకి 400 పైగా సీట్లు రావడం ఖాయమని మోదీని ఆపే శక్తి దేశంలో ఏ పార్టీకి లేదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఇండియా కూటమే రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించడం లేదని, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుపై పూర్తిగా విఫలం అయిందని వారన్నారు. భారతదేశం వికసించే భారత్ కావాలంటే దేశం మరింత అభివృద్ధి చెందేందుకు మరోసారి మోదీ ప్రధాని కావాల్సిందే అని ప్రజలంతా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి తమ మద్దతును తెలిపి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చేందుకు కృషి చేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.
జడ్చర్ల కు చేరుకున్న విజయ సంకల్ప యాత్ర…
145
previous post