కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకోవాలన్న విక్రమార్క..

bhatti vikramarka

Advertisements

&NewLine;<p>ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురంలో ఎన్నికల ప్రచారంలో మధిర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు&period; వీరికి గ్రామస్థులు&comma; టిడిపి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు&period; లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇప్పుడు జరిగే ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలని&comma; దొరల తెలంగాణా కావాలా&comma; ప్రజల తెలంగాణా కావాలా తేల్చుకునే ఎన్నికలని అన్నారు&period; BRS పార్టీని దించి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకోవాలనేది ప్రజల్లో ఉందని అన్నారు&period; కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మధిర అభివృద్ధి కోసం నిధులు తీసుకోస్తామని&comma; రైతులకు నీటి సమస్య తీర్చడం కోసం శాశ్వత పరిష్కారం చూపిస్తామని అన్నారు&period; ప్రభుత్వం ఏర్పడగానే నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని&comma; మహిళలకు ప్రతి నెల 2500&comma; రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అన్నారు&period; ముదిగొండ మండలం లో ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసి విద్యార్థులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తాం&period; రాష్ట్రంలో వచ్చే ప్రతి రూపాయి పాలకులు తినకుండా ప్రజలకు పంచెటట్లుగా చూస్తామని అన్నారు&period; తెలంగాణా రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలైనా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని అన్నారు&period; కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది&period; ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలవబోతున్నామని అన్నారు&period; ఈనెల ముప్పైన జరిగే ఎన్నికల్లో ప్రజలు హస్తం గుర్తు పై ఓటేసి నన్ను గెలిపించండని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..