సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి నుండి భారీ బైక్ ర్యాలీతో పెద్దపల్లి వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పెద్దపల్లి పట్టణానికి తిరిగి వచ్చిన ఎమ్మెల్యే విజయ రమణారావుకు నియోజకవర్గ ప్రజలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన చింతకుంట విజయరమణ రావు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో పెద్దపల్లి శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా పెద్దపల్లికి విచ్చేసిన సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల మరియు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామస్థులు విజయ రమణరావు గారికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువకులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను నియోజకవర్గంలోని ప్రజలకు అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
రమణ రావు కు ఘన స్వాగతం…
63
previous post