109
ఆ నియోజకవర్గంలో అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఎంపికపై కుస్తీలు పడుతున్నాయి. అభ్యర్థుల ప్రకటనపై పార్టీ అధినేతలు ఒక్క అడుగు ముందుకు… మూడడుగులు వెనక్కు వేస్తున్నారు. మెట్ట ప్రాంత జనం నాడిని అధినేతలు ఏ యాంగిల్ లో విశ్లేషించాలో అంతుబట్టడం లేదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా… రెండు, మూడు వేల ఓట్ల మెజార్టీనే అందించే అక్కడి ఓటర్లు ఈ దఫా ఎన్నికల్లో బరిలో ఎవరు నిలుస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అధికార, ప్రతిపక్ష అధినేతలు సైతం అభ్యర్థులను ప్రకటించేందుకు కిందా మీద పడుతున్నారు. ఇంతకూ ఏదా నియోజకవర్గం? అక్కడి పరిస్థితి ఏంటి?